రేవంత్ రెడ్డి వెళ్లని చోట పాదయాత్ర చేస్తా: జగ్గారెడ్డి

త్వరలో తాను కూడా మెదక్ నుండి పాదయాత్రను ప్రారంభిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి శుక్రవారం ప్రకటించారు. తన పాదయాత్రకు అనుమతి కోరుతానని, తనకు అనుమతి ఇస్తారనే ఆశిస్తున్నానని చెప్పారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయని నియోజకవర్గాలలో తాను తిరుగుతానని చెప్పారు. గొడవలు ఎందుకనే ఉద్దేశ్యంతోనే తాను గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్నానని చెప్పారు.

కాగా ఇప్పటికే హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, పలువురు కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి మాత్రం రేవంత్, భట్టి తిరగని నియోజకవర్గాల్లో తిరుగుతానని చెబుతున్నారు.

Jagga Reddy
Congress
Revanth Reddy

More Telugu News