తడి గుడ్డతో గొంతు కోసే వ్యక్తి చంద్రబాబు: రోజా
- ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండటం హాస్యాస్పదమన్న రోజా
- ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్న
- గతంలో మోదీని తిట్టి ఇప్పుడు మోదీ విజన్ సూపర్ అంటున్నారని విమర్శ
తడి గుడ్డతో గొంతు కోసే నైజం చంద్రబాబుదని విమర్శించారు. భార్యని కూడా చూసుకోలేనోడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని మోదీని చంద్రబాబు తిట్టారని... ఇప్పుడేమో నేషనల్ మీడియాలో మోదీ విజన్ సూపర్ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నైజం ఇలాగే ఉంటుందని చెప్పారు.