ఓరల్ సెక్స్ విషయంలో జాగ్రత్త.. గొంతు కేన్సర్ రిస్క్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓరల్ సెక్స్ విషయంలో జాగ్రత్త.. గొంతు కేన్సర్ రిస్క్!

Oral sex is a risk factor for throat cancer
  • పాశ్చాత్య దేశాల్లో పెద్ద సంఖ్యలో గొంతు కేన్సర్ కేసులు
  • అమెరికాలో 70 శాతం కేసుల్లో హెచ్ పీవీయే కారణం
  • లైంగికంగా సంక్రమించే వైరస్ నోటిలోకి చేరడంతో కేన్సర్
గత రెండు దశాబ్దాల్లో గొంతు కేన్సర్ కేసులు పాశ్చాత్య దేశాల్లో గణనీయంగా పెరిగాయి. కొందరు  నిపుణులు  దీన్ని మహమ్మారిగానూ అభివర్ణించారు. ఓరో ఫారింజిల్ కేన్సర్ లేదా గొంతు కేన్సర్.. ఇది టాన్సిల్స్ వద్ద మొదలవుతుంది. ఇలా గొంతు కేన్సర్ కేసులు పెరిగిపోవడానికి ఓరల్ సెక్స్ (నోటితో చేసే శృంగారం) ప్రధాన కారణంగా ఉంటున్నట్టు తెలిసింది. హ్యుమన్ పాపిలోమా వైరస్ గురించి వినే ఉంటారు. దీన్నే హెచ్ పీవీ అంటారు. దీని కారణంగా మహిళలకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ వస్తుంటుంది. దీని నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

అమెరికాలో నమోదవుతున్న గొంతు కేన్సర్ కేసుల్లో 70 శాతం హెచ్ పీవీ వల్లేనని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) విభాగం వెబ్ సైట్ గణాంకాల ఆధారంగా ‘ద కన్జర్వేషన్’అనే సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఈ వైరస్ గొంతులో చేరి కేన్సర్ కు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక నోటితో శృంగారానికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోంది. సాధారణంగా హెచ్ పీవీ వైరస్ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. ఓరల్ సెక్స్ ద్వారా ఇది గొంతులోకీ వ్యాపిస్తుంది. ఎక్కువ మంది శృంగార భాగస్వాములు కలిగి ఉన్న వారికి ఈ రిస్క్ ఇంకా ఎక్కువట.

సురక్షితం కాదు..
నోటితో శృంగారం సురక్షిత విధానం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరికి దీని గురించి తెలిసినా, చాలా మందికి దీని వల్ల ఏర్పడే సమస్యలపై అవగాహన ఉండడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఓరల్ సెక్స్ తో సుఖవ్యాధుల ముప్పు పెరుగుతుంది. కనుక దీనికి దూరంగా ఉండాలన్నది సూచన. మరీ ముఖ్యంగా శృంగారానికి ముందు భాగస్వాములు ఇద్దరూ వంటి శుభ్రత ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. నోటిలో ఏవైనా గాయాలు ఉంటే, అవి మానిపోయే వరకు నోటితో శృంగారం అస్సలు చేయకూడదని,  ఈ విషయంలో నియంత్రణలు పాటించాలని సూచిస్తున్నారు.
Advertisement
Oral sex
dangerous
throat cancer
cases rises

More Telugu News