వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఏ1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు
- సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
- గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని విన్నపం
- 5వ తేదీ లోగా సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోవాలంటూ గంగిరెడ్డికి టీఎస్ హైకోర్టు ఆదేశం
వివేకా హత్య కేసును తొలుత ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. 90 రోజులు గడిచిపోయినా గంగిరెడ్డిపై సిట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. నిబంధనల ప్రకారం నిందితులపై 90 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలి. లేని పక్షంలో సాంకేతిక కారణాలతో బెయిల్ లభిస్తుంది. ఇదే కారణంతో గంగిరెడ్డి బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. 2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.