అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్‌కు రైతుల నుండి నిరసన సెగ
- సీఎం కాన్వాయ్ ని అడ్డుకునేందుకు రైతుల ప్రయత్నం
- జగన్ పుట్టపర్తికి రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఘటన
- నిరసనకారులను తప్పించిన భద్రతా సిబ్బంది
పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ తుంపర్తి, మోటుమర్రు ప్రాంతంలో 210 ఎకరాలు సేకరించిన అధికారులు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. తాము సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని, కానీ పోలీసులు తమను తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.