జగదీశ్ శెట్టార్ కు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే: రాహుల్ గాంధీ
- 40 శాతం కమీషన్లు తీసుకోకపోవడం వల్లే జగదీశ్ కు బీజేపీ టికెట్ ఇవ్వలేదని రాహుల్ ఆరోపణ
- బీజేపీకి 40 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వకూడదని పిలుపు
- ఒక ఎమ్మెల్యే కొడుకు స్కామ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని విమర్శ
మైసూర్ శాండల్ సోప్ స్కామ్ లో ఒక బీజేపీ ఎమ్మెల్యే కొడుకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని రాహుల్ దుయ్యబట్టారు. పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రిక్రూట్ మెంట్ స్కామ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కామ్, అసిస్టెంట్ ఇంజినీర్ జాబ్స్ స్కామ్ తదితర ఎన్నో స్కామ్ లు బీజేపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్నాయని విమర్శించారు.