మహిళతో ఝార్ఖండ్ మంత్రి అసభ్య సంభాషణ వీడియో... రాజీనామాకు బీజేపీ డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళతో ఝార్ఖండ్ మంత్రి అసభ్య సంభాషణ వీడియో... రాజీనామాకు బీజేపీ డిమాండ్

Jharkhand Minister video call with a woman goes viral  BJP demands resignation
  • మహిళతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ఆరోగ్య మంత్రి
  • అది నిజమైతే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్
  • తనను అపఖ్యాతి చేసే కుట్ర అని, ఎడిటింగ్ చేసిన వీడియో అని మంత్రి ఎదురుదాడి
 ఝార్ఖండ్ మంత్రి ఒకరు ఓ మహిళతో వీడియో కాల్ ద్వారా అసభ్య సంభాషణ జరిపినట్లుగా వెలుగు చూడటం సంచలనం రేపింది. ఈ వీడియో కాల్ ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. కాగా ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఫోన్ లో ఓ మహిళతో మాట్లాడారు. వారిద్దరి మధ్య అసభ్య సంభాషణ జరిగినట్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేశారు.

కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స్వభావం ఇదేనని, ఇది ఝార్ఖండ్ మంత్రి తీరు అని, మహిళల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇందుకు సంబంధించి దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది నిజమైతే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

ఈ వీడియోపై మంత్రి బన్నా వివరణ ఇచ్చారు. తనను అపఖ్యాతి పాల్జేసే కుట్రలో భాగంగా ఇది వచ్చిందని, ఇది ఎడిట్ చేసిన వీడియో అని అర్థమవుతోందని, తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీసులు ఈ వీడియోపై దర్యాఫ్తు చేసి, తనను ఇరికించాలనే ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.
Advertisement
Jharkhand

More Telugu News