వైఎస్ షర్మిల కారు డ్రైవర్ అరెస్ట్... ఎందుకంటే..!
- కానిస్టేబుల్ కాలి పైకి కారు ఎక్కించిన కేసులో డ్రైవర్ అరెస్ట్
- వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు
- డ్రైవర్ వైద్య పరీక్షల్లో షుగర్ 502
కాగా, పోలీసులపై చేయి చేసుకున్న కేసులో షర్మిల పైన ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం ఇంటి నుండి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేను బయటకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎస్సై రవీందర్ తో పాటు, మహిళా కానిస్టేబుల్ పైన చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.