భారత్‌లో స్వల్పంగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు
- శనివారం కొత్తగా 10,112 కరోనా కేసులు, 29 మరణాల నమోదు
- మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 64,806
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
ఇక శనివారం కరోనాతో 29 మంది మరణించారు. ఒక్క కేరళలోనే ఏడుగురు కన్నుమూశారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,329కు చేరుకుంది. కరోనా వ్యాప్తి తీవ్రతను సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.43 శాతంగా ఉందని పేర్కొంది. కొవిడ్ రికవరీ రేటు 98.66 శాతమని వెల్లడించింది.