సీఎస్కే బౌలర్ పై హర్బజన్ సింగ్ ప్రశంసలు
- జడేజా లైన్ అండ్ లెన్త్ అద్భుతంగా ఉందని మెచ్చుకోలు
- ఒక్క చెత్త బాల్ కూడా వేయలేదన్న హర్బజన్ సింగ్
- సన్ రైజర్స్ ఆటగాళ్ల షాట్స్ ఎంపికలను తప్పుబట్టిన మాజీ క్రికెటర్
జడేజా సన్ రైజర్స్ స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ వికెట్లను తీశాడు. మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో హర్బజన్ మాట్లాడాడు. ‘‘జడేజా కనీసం ఒక్క చెత్త బాల్ కూడా వేయలేదు. జడేజా లైన్ అండ్ లెన్త్ ఎంతో అద్భుతంగా ఉంది. అతడి బౌలింగ్ లో పరుగులు రావాలంటే బ్యాటర్ ప్రత్యేకంగా ఏదైనా చేయాల్సిందే. అతడు పరుగులు ఇవ్వడు. స్కోర్ కోసం షాట్స్ ఆడాల్సిందే. వారు ఎంపిక చేసుకున్న (సన్ రైజర్స్ ఆటగాళ్లు) షాట్స్ కూడా తప్పే. మయాంక్ అగర్వాల్ చాలా ముందుగా క్రీజు నుంచి వచ్చేశాడు’’ అని హర్బజన్ పేర్కొన్నాడు.