నాకు చీకటి అంటే భయం: హీరో సాయితేజ్

Saitej Interview
  • హారర్ థ్రిల్లర్ గా రూపొందిన 'విరూపాక్ష'
  • ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ 
  • నైట్ షూటింగు ఎక్కువగా ఉండేదన్న సాయితేజ్ 
  • ఈ నెల 21న విడుదలవుతున్న సినిమా
సాయితేజ్ చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా 'విరూపాక్ష'. ఇంతవరకూ రొమాంటిక్ టచ్ తో కూడిన మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన సాయితేజ్, తొలిసారిగా చేసిన హారర్ థ్రిల్లర్ ఇది. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చాడు. 

ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయితేజ్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన సోనియా సింగ్ .. సాయితేజ్ ను ఇంటర్వ్యూ చేసింది. సరదాగా .. సందడిగా ఈ ఇంటర్వ్యూ కొనసాగింది. 

సాయితేజ్ మాట్లాడుతూ .. నాకు చీకటి అంటే భయం. అయితే ఈ సినిమా షూటింగు ఎక్కువగా రాత్రివేళల్లోనే చేశారు. భయపడొద్దనీ .. ధైర్యంగా ఉండమని నాతో చెప్పేవారు. 'మనం ప్లాన్ చేసిన సౌండ్స్ మాత్రమే వస్తే ఓకే, కొత్తగా వేరే సౌండ్స్ వినిపిస్తే మాత్రం వెంటనే కారు ఎక్కేసి వెళ్లిపోతాను' అని నేను అనేవాడిని. అలా నైట్ షూటింగ్స్ కొంచెం టెన్షన్ తోనే నడిచాయి" అన్నాడు. 
Go Back to Shorts
Saitej
Samyukth Menon
Virupaksha Movie

More Telugu News