సౌత్ ఇండస్ట్రీపై మరోసారి నోరు పారేసుకున్న తాప్సీ
- దక్షిణాదిలో చేసిన చిత్రాలతో తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని వ్యాఖ్య
- అక్కడ నటిగా సంతృప్తే దొరకలేదన్న హీరోయిన్
- అందుకే బాలీవుడ్ కు వెళ్లిపోయానన్న తాప్సీ
అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘పింక్’ చిత్రం చేయడంతో తన సినీ జీవితం గొప్ప మలుపు తిరిగిందని చెప్పింది. బాలీవుడ్ ను పొగిడే క్రమంలో సౌత్ ఇండస్ట్రీని చులకన చేసిన తాప్సీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీని, తనను పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని అందుకున్న సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ ఇలా మాట్లాడటం తగదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.