రెస్టారెంట్లో మిస్ బిహేవ్ చేసిన కస్టమర్లకు మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం చూపిన యువతి
- ఫిమేల్ బ్రూస్ లీ అంటూ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్
- ప్రశంసల్లో ముంచెత్తిన నెటిజన్లు
- కుర్చీ విసిరిన వ్యక్తిని తన్ని పడేసింది
ఇద్దరు పురుష కస్టమర్లు రెస్టారెంట్ లో ఎదురెదురుగా కూర్చుంటారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన వెయిట్రెస్ తో ఒకతను అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది. ఆమె వెంటనే తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని అతని పైన ప్రదర్శించింది. మధ్యలో రెండో వ్యక్తి కూడా ఆమె పైకి రాగా ఆయనకు కూడా బుద్ధి చెప్పింది. తన పైకి కుర్చీ విసిరిన వ్యక్తిని ఆమె ఒక తన్ను తన్ని పడేసింది.