బీజేపీని 40 స్థానాల్లో గెలిపించండి చాలు: రాహుల్ గాంధీ
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ బిజీ
- కాంగ్రెస్ ను కనీసం 150 స్థానాల్లో గెలిపించాలని ప్రజలకు విన్నపం
- రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని హామీ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఓబీసీ డేటాను పబ్లిక్ డొమైన్ లో ఉంచుతామని చెప్పారు. ఆదివాసీలకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోని ఆరు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పారు. ఓబీసీలకు న్యాయం చేయలేని ప్రధాని మోదీ వెళ్లిపోవాలని అన్నారు.