గర్భంతో ఉన్న నటి సనా ఖాన్‌ను బరబరా లాక్కుంటూ వెళ్లిన భర్త.. వీడియో వైరల్
- సనా ఖాన్ చేయిపట్టి బరబరా లాక్కెళ్లిన భర్త
- నెట్టింట వీడియో వైరల్
- వీడియోపై వివరణ ఇచ్చుకున్న నటి
- తన భర్త తప్పేంలేదంటూ స్పష్టం చేసిన నటి
నడవలేక వగరుస్తూ ఆపసోపాలు పడుతున్న సనా ఖాన్‌ను ఆమె భర్త బలవంతంగా లాక్కెళ్లుతున్నట్టు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. సనా భర్తపై విమర్శలు గుప్పించారు. దీంతో.. స్వయంగా సనా రంగంలోకి దిగాల్సి వచ్చింది. తానే తొందరగా వెళ్లిపోదామని భర్తను కంగారు పెట్టానంటూ ఆమె వివరణ ఇచ్చుకుంది. ‘‘ఎవరికీ ఇబ్బంది కలగకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని నేనే చెప్పాను. కాస్తంత చల్లని ప్రదేశంలో కూర్చుంటే సేదతీరొచ్చనే ఉద్దేశంతో నా భర్త వేగంగా ముందుకెళ్లిపోయారు’’ అని ఆమె వివరించింది. వీడియో చూసి తాను కూడా కాస్తంత షాకయ్యానని చెప్పుకొచ్చింది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.