సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా ...అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు ప్రకటన
- రేపు అనంతపురం జిల్లా శింగనమలలో పర్యటించాల్సిన జగన్
- కార్యక్రమం రద్దయినట్టు ప్రకటన
- రేపు విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎం జగన్
అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26కి వాయిదా వేసినట్టు సీఎంవో అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం విజయవాడలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ప్రకారమే కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.