Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూజర్లకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక

IRCTC warn users of a fake app circulating on whatsapp and telegram
Advertisement
  • వాట్సాప్, టెలిగ్రామ్‌లో నకిలీ యాప్ చక్కర్లు కొడుతోందన్న ఐఆర్‌సీటీసీ
  • డౌన్‌లోడ్ చేసుకుంటే సైబర్ దాడుల బారిన పడొచ్చని వార్నింగ్
  • ఐఆర్‌సీటీసీ అధికారులమని చెప్పుకుంటూ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం తస్కరిస్తారని వెల్లడి
  • గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచన
Advertisement
ఐఆర్‌సీటీసీ పేరిట వైరల్ అవుతున్న ఓ నకిలీ యాప్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రజలకు తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది. ఐఆర్‌సీటీసీకనెక్ట్ పేరిట ఈ యాప్‌కు సంబంధించిన ఏపీకే ఫైల్ వాట్సాప్, టెలిగ్రామ్‌లో చక్కర్లు కొడుతోందని తెలిపింది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వారి ఫోన్లు సైబర్ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఈ యాప్ ద్వారా నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారం, యూపీఐ, బ్యాంకింగ్ వివరాలను తస్కరించే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ అధికారులమని చెప్పుకుంటూ కొందరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లపై ఒత్తిడి తెస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. కాబట్టి.. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌ నుంచి మాత్రమే ఐఆర్‌సీటీసీ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని హెచ్చరించింది.
Advertisement
Advertisement
IRCTC

More Telugu News