హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

CM KCR unveils Ambedkar statue in Hyderabad
  • హైదరాబాదులో అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు
  • నేడు అంబేద్కర్ జయంతి
  • హుస్సేన్ సాగరతీరంలో విగ్రహావిష్కరణ
  • హెలికాప్టర్ ద్వారా పూలవర్షం
హైదరాబాదు హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఆవిష్కరించారు. బౌద్ధ మత గురువులు ప్రార్థనలు చేస్తుండగా, రాజ్యాంగ నిర్మాత భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. 

ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, పువ్వాడ తదితరులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.
Advertisement
KCR
Ambedkar Statue
Hyderabad
BRS
Telangana

More Telugu News