అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడే శ్రీకారం చుట్టాం.. దళిత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు
- అంబేద్కర్ స్ఫూర్తితో దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతనిచ్చామన్న చంద్రబాబు
- పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చామని వ్యాఖ్య
- ప్రతి పనిని దళితవాడ నుంచి ప్రారంభించే సంప్రదాయాన్ని తెచ్చామన్న బాబు
పేద విద్యార్ధులకు విదేశీ విద్యను అందించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. ఏ ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని మొదటగా దళితవాడ నుంచి మొదలు పెట్టే సంప్రదాయాన్ని తెచ్చామని అన్నారు. ఇకముందు కూడా అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు.