పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణం.. విశాఖ గీతం వర్సిటీ వద్ద మళ్లీ ఉద్రిక్తత
- వర్సిటీలో గుర్తించిన ప్రభుత్వ భూమిలో కంచె నిర్మాణం
- నిర్మాణ సామగ్రితో వర్సిటీలోకి ప్రవేశించిన రెవెన్యూ అధికారులు
- వర్సిటీకి దారితీసే రోడ్లపై రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లు
- ఐడీ కార్డులు చూపిస్తేనే స్థానికులకు అనుమతి
వర్సిటీలో కంచె నిర్మాణం నేపథ్యంలో ఈ తెల్లవారుజామున 2 గంటల నుంచే గీతం వర్సిటీకి దారితీసే అన్ని రోడ్లపైనా పోలీసులు మోహరించి ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఎండాడ, రుషికొండ మార్గాల్లో వర్సిటీకి రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐడీ కార్డులు చూపించిన స్థానికులను మాత్రం అనుమతించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో గీతం కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.