గుడివాడలో కొడాలి నాని కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Tension at Kodali Nani office in Gudivada
  • గుడివాడలో నేడు చంద్రబాబు పర్యటన
  • రోడ్ షో, సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత
  • కొడాలి నాని కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
  • గుడివాడకు భారీగా పోలీసు బలగాల తరలింపు
టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ గుడివాడ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇలాకాలో చంద్రబాబు రోడ్ షో, సభలో పాల్గొననున్నారు. అయితే, గుడివాడలో కొడాలి నాని కార్యాలయం వద్ద ఈ సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. 

కొడాలి నాని కార్యాలయం వద్దకు వైసీపీ, టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇరు పార్టీల వర్గీయులు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో, పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో గుడివాడకు తరలించారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు పోలీసులను బృందాలుగా విభజించి రూట్లు నిర్దేశిస్తున్నారు.
Go Back to Shorts
Gudivada
Kodali Nani
YSRCP
Chandrababu
TDP
Krishna District

More Telugu News