MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి గిఫ్ట్ ఇస్తారా?

CSK players eyes in win for MSD
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్-16లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 52, దేవదత్ పడిక్కల్ 38, అశ్విన్ 30, హెట్మెయర్ 30 (నాటౌట్) రాణించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఆకాశ్ సింగ్ 2, తుషార్ దేశ్ పాండే 2, రవీంద్ర జడేజా 2, మొయిన్ అలీ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి 200వ మ్యాచ్. దాంతో అందరి దృష్టి ధోనీపైనే ఉంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా తమ సారథికి కానుక ఇవ్వాలని చెన్నై ఆటగాళ్లు భావిస్తున్నారు.
Go Back to Shorts
MS Dhoni
CSK
Rajasthan Royals
IPL

More Telugu News