'దసరా' కోసం కీర్తి ఎంత పెర్ఫెక్ట్ గా డబ్బింగ్ చెప్పిందో చూడండి!
- 'దసరా' సినిమాలో సందడి చేసిన కీర్తి సురేశ్
- ఆమె మాస్ స్టెప్పులను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్
- తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్
- ఆమె అంకితభావానికి ఇదో మచ్చుతునక
తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ కథలో ఆమె తెలంగాణ యాసలోనే డైలాగ్స్ చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుందంటే చాలామంది నమ్మరు. ఈ నేపథ్యంలోనే ఆమె డబ్బింగ్ చెబుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎంత మాత్రం తడబడకుండా ఆమె డబ్బింగ్ చెబుతున్నప్పటి వీడియో చూస్తే, ఆమె అంకితభావం ఏ రేంజ్ లో ఉందనేది అర్థమవుతుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో పెళ్లి కూతురుగా ఒక మ్యూజిక్ లెంగ్త్ లో కీర్తి వేసిన మాస్ స్టెప్పులకు సంబంధించిన వీడియోను అందరూ కూడా విపరీతంగా చూస్తున్నారు .. ఎంజాయ్ చేస్తున్నారు. కథాపరంగా తెలంగాణ నేపథ్యాన్ని కీర్తి ఎంతగా ఆకళింపు చేసుకుందనడానికి ఈ డాన్స్ ను ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.