ఆర్సీబీ కెప్టెన్ కు షాకిచ్చిన మ్యాచ్ రిఫరీ
- స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధింపు
- మొదటి తప్పు కావడంతో రూ. 12 లక్షల జరిమానా
- మ్యాచ్ తర్వాత అతి చేసిన అవేశ్ ఖాన్ కు మందలింపు
మరోవైపు అలాగే చివరి బంతికి విజయం సాధించడంతో లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ హెల్మెట్‌ను నేలకు విసిరి కొట్టాడు. దాంతో, అది అతడి మొదటి తప్పిదంగా భావించి అతడిని రిఫరీ మందలించి వదిలేశాడు. కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోహ్లీ (61), డుప్లెసిస్ (79 నాటౌట్), మ్యాక్స్‌వెల్ (59) రాణించారు. ఛేజింగ్‌కు దిగిన లక్నో టీమ్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా స్టోయినిస్ (65), పూరన్ (62) సంచలన ఇన్నింగ్స్‌లతో ఉత్కంఠ విజయం సాధించింది.