Ponguleti: పొంగులేటి, జూపల్లిపై కేసీఆర్ సీరియస్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గులాబీ బాస్

Ponguleti and Jupally krishna rao suspended from BRS
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. 

నిన్న కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో తన మద్దతుదారులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, కుటుంబ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ మూడో సారి సీఎం కావాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ వచ్చినప్పుడే కేసీఆర్ గాడి తప్పారని అన్నారు. కేసీఆర్ శకం ముగియబోతోందని చెప్పారు. 

జూపల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్ పేరుతో దేశానికి చెత్త పాలన ఇస్తారా? అని ప్రశ్నించారు. సాగునీటి టెండర్లలో మాయాజాలం ప్రదర్శిస్తూ వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. వీరి వ్యాఖ్యలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరిపై వేటు వేశారు.
Go Back to Shorts
Ponguleti
Jupally
BRS
Suspend

More Telugu News