Pawan Kalyan: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ పని మొదలైంది

Pawan Kalyan OG Test shoot underway
షార్ట్స్‌లో చూడండి
ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలలో టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కల్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అటు పొలిటికల్ టూర్స్‌, ఇటు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. 

మరోవైపు  సుజిత్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఓజీ’చిత్రానికి కూడా ఓకే చెప్పారు. ఉస్తాద్ తో పాటు ఈ చిత్రంలోనూ నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం టెస్ట్ షూట్ జరుగుతోందని చిత్ర బృందం ప్రకటించింది. టెస్ట్ షూట్ జరుగుతున్న ఫొటోలను సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభమవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Pawan Kalyan
OG Movie
Sujeet
test shooting

More Telugu News