బీహార్ మంత్రి తేజ్‌ప్రతాప్‌కు వారణాసిలో దారుణ అవమానం!
- మంత్రి దర్శనానికి వెళ్లిన సమయంలో లగేజీని బయట పడేసిన హోటల్ సిబ్బంది
- ఆయన ఒక్క రోజుకు మాత్రమే రూము బుక్ చేసుకున్నారన్న ఏసీపీ
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ ఘటనపై ఏసీపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న ఒక్క రాత్రి కోసం తేజ్‌ప్రతాప్ హోటల్ రూము బుక్ చేసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాతి రోజు ఆయన దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారని చెప్పారు. అయితే, ఏప్రిల్ 7న అదే రూమును బుక్ చేసుకున్న వ్యక్తి రావడంతో తేజ్‌ప్రతాప్ గదిలోని వస్తువులను హోటల్ సిబ్బంది రిసెప్షన్ వద్దకు మార్చారని వివరించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు మరో పోలీసు అధికారి తెలిపారు.
హోటల్ సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి.. తేజ్‌ప్రతాప్ గదిలోని లగేజీని హోటల్ జనరల్ మేనేజర్ తరలిస్తుండడం కనిపించిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై తేజ్ ప్రతాప్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.