స్టాలిన్ కు మల్లికార్జున ఖర్గే ఫోన్
- భావసారూప్యత కలిగిన పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్న కాంగ్రెస్
- మీటింగ్ కు హాజరు కావాలని కోరుతూ స్టాలిన్ కు ఖర్గే ఫోన్
- హాజరవుతానని ఖర్గేకు చెప్పిన స్టాలిన్
విపక్ష పార్టీల సమావేశానికి హాజరుకావాలని స్టాలిన్ ను ఖర్గే ఆహ్వానించారు. తాను సమావేశానికి హాజరవుతానని ఈ సందర్భంగా ఖర్గేకు స్టాలిన్ తెలిపారు. కాంగ్రెస్ కు డీఎంకే మిత్రపక్ష పార్టీ అనే విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. తమిళనాడుతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉంది.
మరోవైపు కాంగ్రెస్ నిర్వహించాలనుకుంటున్న మీటింగ్ కు ఇంకా సమయం, వేదికను నిర్ణయించలేదు. టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాల ప్రతిస్పందన కోసం కాంగ్రెస్ నేతలు వేచి చూస్తున్నారు.