భార్యతో తగవు.. ట్రాన్స్‌ఫార్మర్ పైకెక్కి హైటెన్షన్ వైర్ కొరికేసిన భర్త
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్యతో తగవు.. ట్రాన్స్‌ఫార్మర్ పైకెక్కి హైటెన్షన్ వైర్ కొరికేసిన భర్త

Drunk Tamil Nadu man climbs transformer bites high tension wire over spat with wife
  • తమిళనాడులో వెలుగు చూసిన ఘటన
  • భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
  • బావమరుదులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త
  • వెయిటింగ్ రూంలో ఉండాలని భర్తకు సూచించిన పోలీసులు
  • స్టేషన్ బయటకు వచ్చి హైటెన్షన్ వైర్ కొరికేసిన వైనం
పుట్టింట్లో ఉంటున్న భార్యను వెనక్కు పిలిపించుకునేందుకు పోలీసులను ఆశ్రయించిన ఓ వ్యక్తి క్షణికావేశంలో హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను కొరికేశాడు. తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..చిన్నమంగోడు ప్రాంతానికి చెందిన ధర్మదురై(33)కి భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో ధర్మదురై ఇటీవల తన బావమరుదులపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. 

అయితే..మద్యం మత్తులో ఉన్న అతడిని వెయిటింగ్ రూంలో కాసేపు వేచి చూడాలని సూచించారు. వారి సూచన మేరకు కాసేపు వెయిటింగ్ రూంలోనే గడిపిన అతడు ఆ తరువాత అకస్మాత్తుగా బయటకు వెళ్లి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు. చుట్టూఉన్నవారు ఎంత వారిస్తున్నా వినకుండా హైటెన్షన్ వైర్‌ను నోటితో కొరికేశాడు. తీవ్రగాయాలపాలైన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Tamilnadu

More Telugu News