సంజయ్ ను ఏ కేసులో అరెస్టు చేశారో డీజీపీకే తెలియకపోవడం సిగ్గుచేటు: కిషన్ రెడ్డి
- సంజయ్ అరెస్టుపై డీజీపీకి ఫోన్ చేసిన కేంద్ర మంత్రి
- కేసు ఫైల్ అయిన తర్వాత వివరాలు చెబుతానని డీజీపీ
సమాధానం ఇచ్చారన్న కిషన్ రెడ్డి - డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
పలువురు మీడియా ప్రతినిధులకు పంపినట్టుగా ఆ వ్యక్తి బండి సంజయ్ కు కూడా హిందీ పేపర్ ను పంపారని కిషన్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ కు ఆ వ్యక్తి హిందీ పేపర్ వాట్సాప్ లో ఎందుకు షేర్ చేశాడో తమకు తెలియదన్నారు. వాట్సాప్ లో ఓ వ్యక్తి పేపర్ ను షేర్ చేస్తే బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతామన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇక సంజయ్ అరెస్ట్ కారణంగా ఈ నెల 8వ తేదీన హైదారాబాద్ లో జరిగే ప్రధాని మోదీ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది వుండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.