సోనియా, రాహుల్ గాంధీలను కేసీఆర్ ఎందుకు విమర్శించరు?: ఎర్రబెల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోనియా, రాహుల్ గాంధీలను కేసీఆర్ ఎందుకు విమర్శించరు?: ఎర్రబెల్లి

తెలంగాణ వనరులను కాంగ్రెస్ నాయకులు దోచుకుంటుంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేసారని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై మండిపడ్డారు. సకల జనుల సమ్మె మరో వారం కొనసాగిస్తే తెలంగాణ వచ్చేదని అభిప్రాయపడ్డారు. బీడీ కట్టల మీద పుర్రె గుర్తు వేస్తే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని అడిగారు. సోనియా, రాహుల్ గాంథీలను కేసీఆర్ ఎందుకు విమర్శించడం లేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో టీడీపీ స్పష్టంగా ఉందని తెలిపారు.

More Telugu News