సిక్కింలో మంచు తుపాను... ఆరుగురి మృతి
- నాథూలా సరిహద్దు వద్ద మంచు తుపాను
- పర్యాటకులను కప్పేసిన మంచు
- ఇప్పటివరకు 22 మందిని కాపాడిన అధికారులు
- 12 మందికి గాయాలు
మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంచు తుపాను సంభవించింది. పర్యాటకులు తప్పించుకునేలోపే వారిని భారీ మంచుచరియలు కప్పేశాయి. మంచు కింద ఇంకా చాలామంది పర్యాటకులు ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 22 మందిని కాపాడారు.