Salman Khan: సల్మాన్ లుంగీ సాంగ్ లో సందడి చేసిన చరణ్!

Kisi Ka Bhai Kisi Ki Jaan Song released
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ హీరో సల్మాన్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కిసీ కా భాయ్ .. కిసీ కి జాన్' ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ ను వదిలారు. 'ఏంటమ్మా ఏంటమ్మా' అంటూ సాగే ఈ పాటను సల్మాన్ .. వెంకీ .. పూజ హెగ్డే బృందంపై చిత్రీకరించారు. తెలుగు .. హిందీ భాషలను మిక్స్ చేసి వదిలిన పాట ఇది. పాయల్ దేవ్ కంపోజ్ చేసిన ఈ పాట మాస్ బీట్ తో నడుస్తుంది. 

ఎల్లో షర్టులు .. తెల్లని లుంగీలు .. బ్లాక్ కలర్ షూ .. స్పెట్స్ తో సల్మాన్ - వెంకీ కనిపించారు. ఇక మిగతా బృందంలో లేడీస్ అంతా చీరకట్టులో నగలు ధరించి .. స్పెట్స్ తో కనిపిస్తున్నారు. తమిళ సంప్రదాయాన్ని టచ్ చేస్తూ ఈ పాట కొనసాగడం విశేషం. ఈ పాట మధ్యలో చరణ్ ఎంట్రీ ఇచ్చి .. మాస్ స్టెప్పులతో సందడి చేశాడు. అటు వెంకీ .. ఇటు చరణ్ ఇద్దరూ కూడా సల్మాన్ కి మంచి స్నేహితులు కావడం విశేషం.

Go Back to Shorts
Salman Khan
Pooja Hegde
Venkatesh Daggubati
Ram Charan

More Telugu News