భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం
- గంటకు 67 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
- ఫిబ్రవరిలోనే ఈ గ్రహశకలం కదలికలను గుర్తించిన నాసా
- ఈ నెల 6న భూమి సమీపంలో నుంచి పోతుందని వెల్లడి
అంతరిక్షంలో చిన్నా పెద్ద కలిపి మొత్తం 30 వేలకు పైగా గ్రహశకలాలు చక్కర్లు కొడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో సుమారు 850 శకలాలు భారీ పరిమాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. కిలోమీటర్ల కొద్దీ పొడవున్న శకలాలు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. అయితే, మరో వందేళ్ల వరకూ ఈ గ్రహశకలాలతో భూమికి వచ్చే ముప్పేమీ లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, మంగళ, బుధ వారాల్లో కూడా నాలుగు చిన్న చిన్న గ్రహశకలాలు భూమికి దగ్గర్లో నుంచి దూసుకెళతాయని చెప్పారు.