ఆధార్ కార్డుల జారీపై పరిపూర్ణానందస్వామి కీలక వ్యాఖ్యలు
- హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్ కార్డులు ఇవ్వాలన్న పరిపూర్ణానంద
- హిందూ పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకు రావాలని డిమాండ్
- జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని వ్యాఖ్య
హిందూ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. హిందువులుగా జీవించే వారికి, హిందువులు కాకున్నా హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలన్నారు. జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని, అందుకనే ఇక్కడ చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ అంశం దేశవ్యాప్తం కావాలన్నారు.