'దసరా' గురించి రాజమౌళి స్పందన ఇదే!
- క్రితం నెల 30న వచ్చిన 'దసరా'
- 100 కోట్లకి చేరువవుతున్న సినిమా
- ప్రముఖుల నుంచి లభిస్తున్న ప్రశంసలు
- దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను అభినందించిన రాజమౌళి
ఈ నేపథ్యంలో ఈ సినిమా అభిమానుల నుంచి ప్రముఖుల నుంచి ప్రశంసలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమా చూసి ప్రభాస్ .. మహేశ్ బాబు వంటివారు అభినందనలు తెలియజేయగా, తాజాగా రాజమౌళి తనదైన శైలిలో స్పందించారు. "నాని - కీర్తి సురేశ్ గొప్పగా పెర్ఫార్మ్ చేశారు. శ్రీకాంత్ ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా తెరకెక్కించాడు. పెద్ద హిట్ అందుకున్న టీమ్ కి అభినందనలు" అంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.
రాజమౌళి మెచ్చుకున్నారంటే ఆ సినిమాపైకి అందరి దృష్టి మళ్లుతుంది. కంటెంట్ ఉంటేనే తప్ప ఆయన అభినందించరనే నమ్మకం చాలామందిలో ఉంది. అందువలన సహజంగానే 'దసరా' ఫ్లోటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ధరణి పాత్రలో నాని కనిపించే ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ అలరించనుంది.