గాడిద పాలతో చేసిన సబ్బు మహిళలను మరింత అందంగా చేస్తుంది: మేనకాగాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాడిద పాలతో చేసిన సబ్బు మహిళలను మరింత అందంగా చేస్తుంది: మేనకాగాంధీ

Donkey milk soap makes women most beautiful says Menaka Gandhi
  • క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం చేసేవారన్న మేనక
  • గాడిద పాలతో చేసిన సబ్బు ఢిల్లీలో రూ. 500కు దొరుకుతుందని వెల్లడి
  • మేక, గాడిద పాలతో చేసిన సబ్బులను మనమెందుకు తయారు చేయకూడదని ప్రశ్న
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో చేసిన సబ్బు మహిళల అందాన్ని మరింత పెంచుతుందని ఆమె అన్నారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా గాడిదపాలతో స్నానం చేసేవారని చెప్పారు. గాడిద పాలతో చేసిన సబ్బు ఢిల్లీలో రూ. 500కి లభిస్తోందని తెలిపారు. మేక పాలు, గాడిద పాలతో చేసిన సబ్బులను మనమెందుకు తయారు చేయకూడదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

లడాఖ్ ప్రజలు గాడిద పాలతో చేసిన సోపులను తయారు చేస్తారని మేనక చెప్పారు. మీరు గాడిదను చూసి ఎంత కాలమయిందని ప్రశ్నించారు. గాడిదల సంఖ్య తగ్గిపోతోందని చెప్పారు. రజకులు కూడా గాడిదలను వినియోగించడం తగ్గించేశారని చెప్పారు.
Advertisement
Menaka Gandhi
BJP
Donkey milk soap

More Telugu News