సీఎస్కే, ముంబై తర్వాత ఆర్సీబీదే ఆ ఘనత: కోహ్లీ
- 2023లో శుభారంభం చేసిన ఆర్సీబీ
- ముంబైపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం
- అర్ధ సెంచరీలతో జట్టును గెలిపించిన కోహ్లీ, డుప్లెసిస్
సీఎస్కే 11 సార్లు ప్లే ఆఫ్స్ చేరుకోగా, ముంబై తొమ్మిది సార్లు ప్లేఆఫ్స్ ఆడింది. ఇదే విషయాన్ని కోహ్లీ గుర్తు చేశాడు. ముంబైపై ఆర్సీబీ భారీ విజయం గురించి మాట్లాడాడు. ‘మేం ఒక సమయంలో ఒకే మ్యాచ్ గురించి ఆలోచిస్తాం. జట్టు సమతూకంలో ఉండేలా చూసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ రాత్రి (ఆదివారం) మాదిరిగానే ఇకపైనా మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని అనుకుంటున్నాం’ అని వివరించాడు.
తొలి పోరులో 49 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేసిన విరాట్ ఐపీఎల్ లో మరో మైలురాయిని చేరుకున్నాడు. మెగా లీగ్ లో 800 బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) క్లబ్ లో చేరాడు. గత సీజన్ వరకు 796 బౌండరీలు సాధించిన విరాట్ తాజా మ్యాచ్ లో 800 బౌండరీల క్లబ్ లో చేరాడు. శిఖర్ ధవన్ (843), డేవిడ్ వార్నర్ (800) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా నిలిచాడు. అలాగే, ఐపీఎల్‌లో 50 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. వార్నర్ 55 అర్ధ సెంచరీలతో ముందున్నాడు.