రేపు వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం
- తాడేపల్లిలో సమావేశం
- గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష
- జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంపై దిశానిర్దేశం
ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొననున్నారు. గడప గడపకు కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక, జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమంపైనా సీఎం జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.