భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు
- దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,824 కరోనా కేసులు
- రోజూవారీ కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల
- కరోనా కట్టడికి నడుం కట్టిన రాష్ట్రాలు
ఇటీవల కాలంలో భారత్‌లో రోజువారి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి కట్టడి చర్యలు ప్రారంభించాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, హరియాణాతో పాటూ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో శనివారం కొత్తగా 400 కేసులు వెలుగులోకి రాగా మహారాష్ట్రలో 669 కరోనా కేసులు బయటపడ్డాయి.