ఏకంగా షారుక్ ఖాన్ను దాటి అగ్రస్థానం సాధించిన రాశీ ఖన్నా
- ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో రాశీకి టాప్ ప్లేస్
- ఫర్జీ వెబ్ సిరీస్ లో ఆమె పాత్రకు దేశవ్యాప్తంగా గుర్తింపు
- అన్ని భాషల్లో ఆకట్టుకున్న ఫర్జీ సిరీస్
ఈ నేపథ్యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో రాశీ ఖన్నా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏకంగా బాలీవుడ్ బడా స్టార్ షారూఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ సాధించి ఔరా అనిపించింది. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డానని రాశీ చెప్పింది.ఈ విషయాన్ని మొదట తాను నమ్మలేదని, నిజమో కాదో తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టిందని తెలిపింది.
తన తండ్రికి ఫోన్ చేసి ఈ ఆనందాన్ని పంచుకున్నానని తెలిపింది. ‘ఆయనకు ఐఎండీబీ గురించి ఏం తెలియదు. కానీ, నేను షారుఖ్ ఖాన్ కంటే మొదటి స్థానంలో ఉన్నానని చెప్పగానే ఆయన షాక్కు గురయ్యారు. నా జీవితంలో దీనిని ఓ మైలు రాయిగా భావిస్తాను’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.