తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
- కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఎండ
అదే సమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్, నిర్మల్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని జిల్లాల్లో ఎండ 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.