జగన్ ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు.. తాజాగా నిర్మలా సీతారామన్ తో భేటీ
- నిన్న రాత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం
- షా నివాసంలో దాదాపు 40 నిమిషాలు చర్చలు
- ఈ ఉదయం చివరి నిమిషంలో ఖరారైన నిర్మల అపాయింట్ మెంట్
కానీ, చివరి నిమిషంలో రావాలని జగన్‌కి సీతారామన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం జగన్.. ఆమెతో సమావేశం అయ్యారు. మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని నిర్మలను జగన్ కోరినట్లు తెలుస్తోంది. కాగా, 15 రోజుల వ్యవధిలో జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన చర్చలు జరిపారు.