Kiran Abbavaram: భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి .. 'మీటర్' ట్రైలర్ డైలాగ్!

Meter trailer released
షార్ట్స్‌లో చూడండి
నాని తరువాత ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోగా కిరణ్ అబ్బవరం కనిపిస్తాడు. ఆయన వరుస సినిమాలు చేయడం ఒక విశేషమైతే, ఆ సినిమాలు పెద్ద బ్యానర్లలో ఉండటం మరో విశేషం. అలా ఆయన క్లాప్ - మైత్రీ బ్యానర్లలో చేసిన సినిమానే 'మీటర్'. 

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో ఆయన జోడీగా అతుల్య రవి అలరించనుంది. పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బవరం కనిపించనున్న ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 


లవ్ .. రొమాన్స్ .. కామెడీ ..  మాస్ డాన్సులు .. ఫైట్లను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి' అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.


Go Back to Shorts
Kiran Abbavaram
Athulya Ravi
Meter Movie

More Telugu News