9వ తరగతి పరీక్షల్లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. నెట్టింట వైరల్
- ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ పై కోహ్లీ సెంచరీ
- నాటి ఫొటోను ఉంచి డిస్క్రిప్షన్ రాయంటూ విద్యార్థులకు ప్రశ్న
- తాను అయితే ఓ పుస్తకమే రాస్తానన్న ఒక యూజర్
ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ ఫొటోని ఉంచి, దీనిపై 100-120 పదాల్లో డిస్క్రిప్షన్ రాయాలని కోరారు. ఈ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఇది పెద్ద వైరల్ గా మారింది. కోహ్లీకి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో కోహ్లీ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘దీన్నే సక్సెస్ అంటారని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ ఇమేజ్ పై నేను ఒక పుస్తకమే రాస్తాను. ఈ ఫొటో చూసి చెప్పేందుకు ఎంతో ఉంది’’ అని పేర్కొన్నాడు.