అమెరికాలోని సిక్కు గురుద్వారాలో కాల్పులు
- కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీలో కాల్పులు
- ఒకరికొకరు తెలిసిన వారి మధ్యే ఫైరింగ్
- ఇద్దరి పరిస్థితి విషమం
ఈ మొత్తం ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు స్నేహితులు కాగా... మరొకరు ప్రత్యర్థి. వీరు ముగ్గురూ ఒకరికొకరు తెలుసు. గాయపడిన ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత ఏడాది అమెరికాలో తుపాకీ కాల్పుల కారణంగా దాదాపు 44 వేల మంది మృతి చెందారని గణాంకాలు చెపుతున్నాయి. వీటిలో హత్యలు, ఆత్మహత్యలు, సెల్ఫ్ డిఫెన్స్ సమయంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయి.