Prakash Raj: ఇందులో కామన్ గా ఉన్నదేంటి?.. ముగ్గురు ‘మోదీ’ల ఫొటోను ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్!

Prakash Raj satirical tweet on the three Modis
షార్ట్స్‌లో చూడండి
‘మోదీ’ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ ను సూరత్ కోర్టు దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ఇవ్వడం 24 గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. 

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా మరో వివాదానికి తెరతీశారు. నాడు రాహుల్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసేలా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ముగ్గురు ఫొటోలను ట్వీట్ చేశారు. అందులో లలిత్ మోదీ, నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ ఉన్నారు. 

రాహుల్ గాంధీకి మద్దతుగానే ప్రకాశ్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘జనరల్ నాలెడ్జ్:- ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటి? జస్ట్ ఆస్కింగ్’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అంతకుముందు లోక్ సభ గజిట్ నోటిఫికేషన్ ను ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. ‘‘ప్రియమైన పౌరులారా .. ఇలాంటి రాజకీయాలకు సిగ్గుపడాలి. ఇది అసభ్యకరమైన తిరోగమన వైఖరి. మనం మౌనంగా ఉంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దేశం కోసం మాట్లాడే సమయం వచ్చింది’’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Prakash Raj
satirical tweet on Modi
Rahul Gandhi
Narendra Modi
Nirav Modi
lalit modi

More Telugu News