అలర్ట్.. వచ్చే నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలర్ట్.. వచ్చే నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

15 Bank holidays in April
  • ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్‌లో బ్యాంకులకు పలు సెలవలు
  • పండగలు, సెలవులు వెరసి మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూత
  • సెలవుల లిస్ట్ విడుదల
వచ్చే నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. సెలవులు, పండగలు కలిసి ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు తెరుచుకోవు. ఏయే రోజుల్లో సెలవు ఉందో తెలిస్తే.. మనం బ్యాంకు పనులను ఎటువంటి ఆటంకాలూ లేకుండా జరుపుకోవచ్చు. 

ఏప్రిల్ నెలలో సెలవులు ఎప్పుడంటే.. 

ఏప్రిల్ 1: కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 2, 9,16,23,30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. 

మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 4న వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. 

ఏప్రిల్ 5 బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 8 రెండో శనివారం,  22 నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. 

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 15న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగలు జరుపుకుంటారు. కాబట్టి..ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. 

షాబ్ ఇ బకర్ కారణంగా ఏప్రిల్ 18న జుమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. 

ఈద్ ఉల్ ఫితర్‌తో ఏప్రిల్ 21న అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
Advertisement
Bank Holidays

More Telugu News