Manchu Vishnu: మనోజ్ విడుదల చేసిన వీడియోపై స్పందించిన మంచు విష్ణు

Manchu Vishnu reacts to his brother Manchu Manoj video
షార్ట్స్‌లో చూడండి
సీనియర్ నటుడు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. 

ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని స్పష్టం చేశారు. మనోజ్ తన తమ్ముడని, తమిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. సారథి తనతో వాగ్వాదం పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్వాదాన్ని ఆపలేకపోయాడని వివరించారు. మనోజ్ చిన్నవాడు కనుక ఏదో కోపంలో ఆ వీడియోను పోస్టు చేసి ఉంటాడని, దీన్ని పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Manchu Vishnu
Manchu Manoj
Video
Tollywood

More Telugu News