United Nations: 2050 నాటి కల్లా భారత్‌లో తీవ్ర నీటి ఎద్దడి

  • తాజా నివేదికలో ఐక్యరాజ్య సమితి హెచ్చరిక
  • భారత్‌లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తుందని వెల్లడి
  • పరిస్థితి అదుపుదాటకుండా అంతర్జాతీయ స్థాయిలో పరిష్కారాలు సిద్ధం చేయాలని సూచన
India Likely To Be Severely Affected By Water Scarcity By 2050

2050 నాటికల్లా భారత్‌లో నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి తాజాగా హెచ్చరించింది. యూనైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్టు- 2023 పేరిట విడుదల చేసిన నివేదికలో పలు ఆందోళనకారక విషయాలను వెల్లడించింది. 

ఈ నివేదిక ప్రకారం.. 2050 నాటికి ప్రపంచంలోని నగరాల జనాభాలో గరిష్ఠంగా 2.4 బిలియన్ల మంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటారు. భారత్‌లో తీవ్రస్థాయిలో నీటి కొరత ఏర్పడుతుంది. అయితే.. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే అంతర్జాతీయ స్థాయిలో పరిష్కారాలు సిద్ధం చేసుకోవాలని యూనెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజూలే పేర్కొన్నారు. 

‘‘నీటిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. సుస్థిర నీటి నిర్వహణ వ్యవస్థలు, నీటి పంపకాల్లో అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి’’ అని స్పష్టం చేశారు.  సమస్య పరిష్కారానికి నడుం కట్టకపోతే ప్రపంచస్థాయిలో సంక్షోభం నెలకొంటుందని వాటర్ రిపోర్టు నివేదిక ఎడిటర్ ఇన్ చీఫ్ రిచర్డ్ కానర్ తేల్చి చెప్పారు.

More Telugu News